Andhra Pradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేటి నుంచి కోస్తాంధ్రలో వర్షాలు
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
- మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు
- 31న రాయలసీమ జిల్లాలోనూ వర్షాలు
కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, ఈ నెల 31, నవంబరు 1న రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.