k ravindra: టీడీపీ నేత కె.రవీంద్ర ఇంట్లో ఐటీ సోదాలు
- గుంటూరు జిల్లాలో ఐటీ సాదాలు
- తెల్లవారుజాము నుంచి 6 గంటలపాటు తనిఖీలు
- మండిపడుతున్న టీడీపీ నేతలు
టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు ఈరోజు మరో నేత కె.రవీంద్ర నివాసంలో సోదాలు చేపట్టారు. గుంటూరు జిల్లాలోని ఆయన నివాసంలో ఈ తెల్లవారుజాము నుంచి దాదాపు ఆరు గంటల సేపు తనిఖీలు కొనసాగాయి. ఈ దాడులపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీని ఇబ్బందులపాలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులకు తెగబడుతోందని అంటున్నారు.