CPI Narayana: సీట్ల కేటాయింపులో ఆలస్యం చేయడం మంచిది కాదు: సీపీఐ నారాయణ
- విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది
- గతంలో పోటీ చేసిన స్థానాలను మాకే ఇవ్వాలి
- కూటమి ప్రయోజనాల దృష్ట్యా కొన్ని స్థానాలు వదులుకుంటాం
సీట్ల కేటాయింపులో ఆలస్యం చేయడం మంచిది కాదని, విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని సీపీఐ నారాయణ అన్నారు. గతంలో పోటీ చేసిన 9 స్థానాలు సీపీఐకే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరామని, కూటమి ప్రయోజనాల దృష్ట్యా కొన్ని స్థానాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఓటమే మహాకూటమి లక్ష్యమని అన్నారు. కాగా, హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా, మునుగోడు, దేవరకొండ స్థానాలపై స్పష్టత ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా వుండగా, తెలంగాణ జన సమితి (టీజేఎస్) కోర్ కమిటీ భేటీలో సీట్ల పంపకాలపై అంతర్గత చర్చ జరిగింది. సీట్ల పంపకాలను త్వరగా తేల్చాలని కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ స్పష్టం చేసినట్టు సమాచారం. తేల్చని పక్షంలో 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని టీజేఎస్ అంటున్నట్టు సమాచారం.