Aravinda Sametha: అమ్మాయిల్ని టీజ్ చేసినా.. నవ్వుకునే లాగే ఉండేది: త్రివిక్రమ్
- ప్రేమ పేరుతో యాసిడ్ దాడులు తెలియవు
- అమ్మాయిలు అమాయకంగా ఉండేవారు
- అమ్మాయిలను ఏడిపించడమే తెలియదు
‘అరవింద సమేత’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కసారి తన గతంలోకి వెళ్లారు. ఒకటి, రెండు సినిమాల్లో తప్ప ఆయన తీసే చాలా వాటిలో మహిళల పాత్రలు సాదాసీదాగా సాగిపోతుంటాయి. మహిళల పాత్రలను అలా చిత్రీకరించడానికి కారణమేంటని ఆయన్ను అడగ్గా.. కారణంతో పాటు గతాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు.
తమ ఊళ్లో ఆడవాళ్లు అమాయకంగా, అణకువగా ఉండేవారని తెలిపారు. తనకు అమ్మాయిలను ఏడిపించడమనేదే తెలియదన్నారు. టీజ్ చేసినా.. అది సరాదాగా ఉండేదే కానీ బాధపెట్టేలా ఉండేది కాదన్నారు. తను పుట్టిన పెరిగిన వాతావరణంలో అమ్మాయిలు ప్రశాంతంగా గడిపేవారని.. ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నదే లేదని త్రివిక్రమ్ తెలిపారు. ప్రేమ పేరుతో యాసిడ్ దాడులనేవి అసలు తెలియవన్నారు. ఇలాంటి వాతావరణంలో తాను పెరిగినందువలన తన సినిమాల్లో మహిళల పాత్రలు అలా చిత్రీకరించి ఉండొచ్చని త్రివిక్రమ్ తెలిపారు.