Sri Lanka: శ్రీలంక మంత్రి, మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ అరెస్ట్!

  • రణతుంగను రాజపక్స అనుచరులు అడ్డుకున్న ఘటన
  • సెక్యూరిటీ గార్డుల కాల్పుల్లో నిన్న ఒకరు మృతి
  • ఈ నేపథ్యంలోనే రణతుంగ అరెస్టు

శ్రీలంకలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ దేశ చమురు శాఖా మంత్రి, మాజీ క్రికెటర్ అర్జున రణతుంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీస్ ప్రతినిధి రువాన్ గుణశేఖర్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేశామని, కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

కాగా, శ్రీలంకలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలలో భాగంగా, విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తప్పించి ఆ పదవిలో రాజపక్సేను గద్దెనెక్కించిన విషయం తెలిసిందే. దీంతో రద్దయిన కేబినెట్ మంత్రులను వారి కార్యాలయాల్లోకి వెళ్ల నీయకుండా రాజపక్స అనుచరులు అడ్డుకున్నారు. అదే క్రమంలో నిన్న తన కార్యాలయంలోకి వెళుతున్న రణతుంగను కూడా అడ్డుకున్నారు. దీంతో, సెక్యూరిటీ గార్డులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే రణతుంగను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News