trivikram: పిల్లలను బాధపెట్టే సీన్స్ చేయడం నా వల్లకాదు: త్రివిక్రమ్
- పిల్లలు బాధలు పడుతున్నట్టుగా చూపించలేను
- వేరే సినిమాల్లో వుంటే చూడలేను
- అది నా మనసుకు కష్టంగా అనిపిస్తుంది
కొంతమంది దర్శకులకు కొన్ని సీన్స్ తీయడం ఇష్టం ఉండదు .. అందువలన అలాంటి సన్నివేశాలను తీయవలసి వస్తే, మరో రకంగా మార్చి చేస్తుంటారు. అలాగే త్రివిక్రమ్ కూడా తనకి ఒక సీన్ చేయడం ఎంతమాత్రం ఇష్టం ఉండదంటూ ఇలా చెప్పారు. 'నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందువలన వాళ్లు బాధపడే .. కష్టపడే సన్నివేశాలను చిత్రీకరించలేను.
ఇక వేరే సినిమాల్లో చిన్న పిల్లలు బాధలు పడే సీన్స్ వున్నా నేను చూడాలేను. అలాంటి సన్నివేశాలు నా మనసుకు కష్టంగా అనిపిస్తాయి. ఇటీవల నయనతార చేసిన 'కర్తవ్యం' సినిమాలో ఒక పాప బోరుబావిలో పడిపోతుంది. అంతే ఆ సినిమాను నేను చూడలేక వెంటనే టీవీ ఆఫ్ చేశాను. ఇక సినిమాల్లోనే కాదు .. టీవీల్లోను .. పేపర్లలోను నేను ఈ తరహా వార్తలను కూడా చూడలేను" అని చెప్పుకొచ్చారు.