mysoora reddy: రాయలసీమకు అన్యాయం జరిగిందనే.. ఉద్యమం వస్తోంది: మైసూరారెడ్డి
- రాయలసీమకు అనాదిగా అన్యాయం జరుగుతోంది
- మిగులు జలాలు పంపిణీ చేయకపోవడం వల్లే సమస్యలు
- చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం
సీనియర్ రాజకీయవేత్త మైసూరారెడ్డి రాసిన 'అస్తిత్వం-ఇది సంగతి' అనే పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించారు. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రాయలసీమకు అనాదిగా అన్యాయం జరుగుతూనే ఉందని అన్నారు. మిగులు జలాలను పంపిణీ చేయకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయం వల్ల ఉద్యమం వస్తోందని తెలిపారు.