sensex: అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు.. నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు
- అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ప్రభావం
- 176 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 52 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
నిన్న భారీ లాభాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావం మార్కెట్లపై పడింది. ముఖ్యంగా ఆయిల్, మెటల్స్ రంగ షేర్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 33,891కి పడిపోయింది. నిఫ్టీ 52 పాయింట్లు పతనమై 10,198కి దిగజారింది.
టాప్ గెయినర్స్:
దేవాన్ హౌసింగ్ (11.99%), ఇండియన్ ఎనర్జీ ఎక్స్ ఛేంజ్ లిమిటెడ్ (11.55%), జస్ట్ డయల్ (11.34%), జెట్ ఎయిర్ వేస్ (10.19%), కల్పతరు పవర్ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ (9.58%).
టాప్ టూజర్స్:
సీఈఎస్సీ లిమిటెడ్ (-17.49%), సింఫనీ లిమిటెడ్ (-7.23%), క్వాలిటీ (-4.95%), చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (-4.73%), మేఘమని ఆర్గానిక్స్ (-4.65%).