Varun Rajendran: వరుణ్‌కి కూడా అదే ఆలోచన వచ్చింది.. కానీ ‘సర్కార్’ కథ నాదే: మురగదాస్
- వరుణ్ రాజేంద్రన్‌కు అనుకూలంగా తీర్పు
- ప్రజల్లో అవగాహన కల్పించాలనుకున్నాను
- స్క్రిప్ట్ కోసం కొన్ని నెలల పాటు కష్టపడ్డాను
‘సర్కార్’ సినిమాపై వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఈ చిత్రాన్ని తన కథతో తెరకెక్కించారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రచయిత వరుణ్ రాజేంద్రన్‌కు అనుకూలంగా తీర్పు లభించింది. తాజాగా దీనిపై చిత్ర దర్శకుడు మురగదాస్ స్పందించారు. కొన్ని నెలల పాటు జరిపిన చర్చలతో ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్నట్టు ఆయన ఇన్స్టాగ్రాం ద్వారా వెల్లడించారు.
‘నకిలీ ఓట్లు సృష్టించి ప్రజాభిప్రాయానికి తావు లేకుండా చేయడం చాలా పెద్ద నేరం. ఈ కాన్సెప్ట్‌తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ప్రజల్లో అవగాహన కల్పించాలనుకున్నాను. సర్కార్ స్క్రిప్ట్ కోసం కొన్ని నెలల పాటు కష్టపడ్డాను. వరుణ్ అనే రచయితకు కూడా ఇలాంటి ఆలోచనే వచ్చింది. తన స్క్రిప్ట్‌ను రిజిస్టర్ చేయించికున్నారని తెలిసింది. ఏది ఏమైనప్పటికీ సర్కార్ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం నాదే’’ మురగదాస్ ఇన్స్టాగ్రాం ద్వారా వెల్లడించారు.