Tata motors: వెయ్యి కోట్ల రూపాయలు నష్టపోయిన టాటా మోటార్స్.. కారణాలు బోలెడు!

  • అమ్మకాలపై ప్రభావం చూపిన చైనా సుంకాలు
  • థాయిలాండ్‌లో నిలిచిపోయిన సబ్సిడీ సంస్థ కార్యకలాపాలు
  • గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,483 కోట్ల లాభాలు

జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో టాటా మోటార్స్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు నష్టపోయింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,483 కోట్ల లాభాలను సొంతం చేసుకున్న టాటా మోటార్స్ ఈసారి అదే సమయానికి ఏకంగా రూ.1009 కోట్ల నష్టం వాటిల్లినట్టు బుధవారం ప్రకటించింది. చైనాలో పన్నులు పెరిగిన కారణంగా జాగ్వార్ లాండ్ రోవర్ వాహనాల అమ్మకాలు పడిపోయాయి. అలాగే, థాయిలాండ్‌లో సబ్సిడీ కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోవడంతో నష్టాల పాలైనట్టు వివరించింది.  

గతేడాది జూన్-సెప్టెంబరు త్రైమాసికంలో రూ.69,838.68 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన టాటా మోటార్స్, ఈసారి అదే త్రైమాసికంలో రూ.2,501 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఫలితంగా సంస్థ మొత్తం ఆదాయం 3.3 శాతం పెరిగి రూ. 72,112.08 కోట్లుగా నమోదైందని సంస్థ వెల్లడించింది. స్టాండప్ లోన్ ప్రాతిపదికన తీసుకుంటే రూ.109.14 కోట్ల లాభం రాగా, నికర నష్టం రూ. 283.37 కోట్లుగా నమోదైంది.

  • Loading...

More Telugu News