Google: గూగుల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన మరో ఫీచర్
- గూగుల్ అసిస్టెంట్‌కు హిందీ సపోర్ట్ ఆప్షన్
- ఈ రోజు నుంచి అందుబాటులోకి
- ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇప్పటికే లభిస్తోంది
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ వినియోగదారులకు ఈ రోజు నుంచి మరో ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. హోం డివైస్‌లలో ఉన్న గూగుల్ అసిస్టెంట్‌కు హిందీ భాష సపోర్ట్‌ను అందిస్తోంది. దీంతో వినియోగదారులు ఇకపై హిందీలో ప్రశ్నలు అడిగినా సమాధానం ఇస్తుంది.
హిందీ సాంగ్స్ ప్లే చేయమని, స్మార్ట్ హోం డివైస్‌లను కంట్రోల్ చేయమని, షాపింగ్, ఇతర సమాచారం వెతకమని యూజర్లు గూగుల్ హోంకు ఆదేశాలు ఇవ్వవచ్చు. అంతేకాకుండా వాతావరణం, కాంటాక్ట్స్ వంటి వివరాలను కూడా వెతకవచ్చు. అలాగే అలారం సౌకర్యం కూడా పొందొచ్చు.
గూగుల్ హోంతో హిందీలో మాట్లాడాలంటే చేయాల్సింది ఇదే..
యూజర్లు ముందుగా తమ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ హోం యాప్‌లోకి వెళ్లాలి. అకౌంట్ - సెట్టింగ్స్ - అసిస్టెంట్ అనే విభాగాల్లోకి వెళ్లాలి. అసిస్టెంట్ విభాగంలో ఉండే యాడ్ లాంగ్వేజ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో హిందీని మొదటి భాషగా సెట్ చేసుకోవాలి. తర్వాత 'ఓకే గూగుల్' అని యూజర్లు సంభాషణ ప్రారంభించవచ్చు. యూజర్లు హిందీలో అడిగే ప్రశ్నలకు హిందీలోనే సమాధానాలు ఇస్తుంది. అయితే ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్లలో లభిస్తుండగా, ఈ రోజు నుంచి గూగుల్ హోం స్మార్ట్ స్పీకర్లలోనూ అందుబాటులోకి వచ్చింది.