Virat Kohli: ఎక్కువ బాల్స్ మిగిలి ఉండగానే కోహ్లీ సేన విజయం!
- ఐదో వన్డేలో 211 బాల్స్ మిగిలి ఉండగానే విజయం
- కోహ్లీ సేనకు ఇదేమీ కొత్త కాదు
- గతంలోనే ఇలాంటి రికార్డులు నెలకొల్పిన టీమిండియా
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను టీమిండియా జట్టు కైవసం చేసుకుంది. తిరువనంతపురం వేదికగా ఈరోజు జరిగిన చివరి వన్డేలో టీమిండియా విజయం సాధించి, 3-1 అధిక్యతతో సిరీస్ ను దక్కించుకుంది. ఒక వికెట్ నష్టపోయిన టీమిండియా ఇంకా 211 బాల్స్ మిగిలి ఉండగానే 105 పరుగుల విజయ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.
అయితే, ఎక్కువ బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ ఫినిష్ చేసి విజయం సాధించడం కోహ్లీ సేనకు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు టీమిండియా ఖాతాలో బాగానే ఉన్నాయి. 2001లో కెన్యాలో బ్లోయెంఫోంటీన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 231 బాల్స్ మిగిలి ఉండగానే భారత జట్టు గెలిచింది. 2015లో పెర్త్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్ లో, 2018లో సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లలో వరుసగా 187,117 బాల్స్ మిగిలి ఉండగానే ఆయా జట్లపై టీమిండియా విజయం సాధించడం గమనార్హం.