Monsoons: ముసురేసిన తెలుగు రాష్టాలు... ఈశాన్య ఋతుపవనాలు వచ్చేశాయి!
- దక్షిణ కోస్తా మీదుగా ప్రవేశం
- శుక్రవారం ఉదయానికి తెలంగాణకు
- ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ఈశాన్య రుతుపవనాలు వచ్చేశాయి. దక్షిణ కోస్తా మీదుగా గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించిన రుతుపవనాలు, శుక్రవారం ఉదయానికి తెలంగాణలోని అధిగ భాగాన్ని ఆక్రమించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ముసురేసింది. రుతుపవనాలు రాయలసీమ మీదుగా కదులుతున్నాయని, దీనికి తోడుగా, నైరుతీ బంగాళాఖాతం మీదుగా ఒక ద్రోణి, దక్షిణ కర్ణాటక, తమిళనాడు మీదుగా మరో ద్రోణి కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.