maha kutami: జాతీయ మహా కూటమిలో ఉండే 15 పార్టీలు ఇవే!

  • విభేదాలను పక్కన పెట్టి.. చేతులు కలిపిన కాంగ్రెస్, టీడీపీ
  • 15 పార్టీలతో రూపుదిద్దుకుంటున్న మహాకూటమి
  • బీజేపీని ఓడించడమే లక్ష్యం

మొదటి నుంచి సైద్ధాంతిక విభేదాలతో ఉప్పు, నిప్పుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు చేతులు కలిపి... దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు నాంది పలికాయి. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విభేదాలను పక్కన పెట్టాయి. ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు... రాహుల్ గాంధీ, శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, సీతారాం ఏచూరి, ఫరుక్ అబ్దుల్లా, తదితర నేతలతో కలసి సరికొత్త రాజకీయ సమీకరణకు తెర లేపారు. ఈ నేపథ్యంలో, అన్ని పార్టీలు కలసి బీజేపీని ఎదుర్కోవాలనే నిర్ణయానికి వచ్చారు.

ఈ మహాకూటమిలో 15 పార్టీలు ఉండనున్నాయి. అవేమిటంటే... కాంగ్రెస్, టీడీపీ, ఎన్సీపీ, ఆర్జేడీ, బీఎస్పీ, ఎస్పీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, జేడీఎస్, తృణమూల్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, డీఎంకే, లోక్ దళ్. ఈ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తూ, జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటయింది. సేవ్ ది నేషన్.. సేవ్ డెమోక్రసీ.. పేరుతో కూటమి రూపుదిద్దుకుంటోంది. 

  • Loading...

More Telugu News