boforce: బోఫోర్స్ కేసు తీర్పుపై అపీల్.. సీబీఐకి షాక్!
- హిందుజా సోదరులను నిర్దోషులుగా ప్రకటించిన తీర్పును సవాల్ చేసిన సీబీఐ
- ఆలస్యంగా అప్పీల్ చేశారన్న సుప్రీంకోర్టు
- సీబీఐ వినతిని తిరస్కరించిన ధర్మాసనం
బోపోర్స్ కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. కేసులో హిందూజా సోదరులను నిర్దోషులుగా ప్రకటించిన తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. సీబీఐ విన్నపాన్ని సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
కేసు వివరాల్లోకి వెళ్తే, హిందుజా సోదరులతో పాటు, ఇతర నిందితులను ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసింది సీబీఐ. కేసును విచారించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం... సీబీఐ వినతిని తిరస్కరించింది. సీబీఐ ఆలస్యంగా అప్పీల్ చేసిందని... దానికి సీబీఐ చెప్పిన కారణాలు కూడా సహేతుకంగా లేవని ధర్మాసనం తెలిపింది.