tej pratap yadav: నేను విడాకులు కోరుకోవడానికి కారణం ఇదే: లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్
- ఐశ్వర్యతో సంతోషంగా ఉండలేకపోయా
- సంతోషం లేనప్పుడు కలసి బతకడంలో అర్థం లేదు
- విడాకుల కోసం కోర్టులో పోరాటం సాగిస్తా
ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తన భార్య ఐశ్వర్యతో విడాకులు ఇప్పించాలంటూ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ, వివాహానంతరం ఐశ్వర్యతో తాను సంతోషంగా ఉండలేకపోయానని చెప్పారు. సంతోషంగా లేకుండా కలసి బతకడంలో అర్థం లేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను విడాకులకు దరఖాస్తు చేసుకున్నానని... కోర్టులో పోరాటం సాగిస్తానని చెప్పారు.
ఈ ఏడాది మే 12న తేజ్ ప్రతాప్, ఐశ్వర్యల వివాహం పాట్నాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా 10వేల మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ తరపు న్యాయవాది మాట్లాడుతూ, కలసి మనుగడ సాగించలేమనే అభిప్రాయానికి కొత్త జంట వచ్చారని చెప్పారు. 1955 హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1), (1ఏ) కింద పిటిషన్ వేశామని తెలిపారు.