t-congress: ఆ పని చేస్తే ‘తెలంగాణ’లో కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుంది: మంత్రి హరీశ్ రావు

  • కాంగ్రెస్ అధికారంలోకొస్తే ‘కళ్యాణ లక్ష్మీ’ని బంద్ చేస్తారట
  • ‘డ్రంకెన్ డ్రైవ్’ ను ఎత్తేస్తామని చెబుతున్నారు
  • చాడ వెంకటరెడ్డికే టికెట్ దక్కలేదు.. అదేమి కూటమి?

తెలంగాణలో తాము అధికారంలో కొస్తే కళ్యాణ లక్ష్మీ పథకాన్ని బంద్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, ఒకవేళ వాళ్లు అధికారంలోకొచ్చి ఆ పని చేస్తే ఈ రాష్ట్రంలో ఆ పార్టీ దుకాణం బంద్ అవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన ఆత్మీయ ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే.. ‘డ్రంకెన్ డ్రైవ్’ను ఎత్తేస్తామని చెబుతున్నారని, ఫుల్ గా తాగి, వాహనాలు నడిపినా ఫర్వాలేదా? అంటూ కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరిగారు.

కాగా, సిద్దిపేట జిల్లాలోని ఏఐటీయూసీ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. వీరిని సాదరంగా పార్టీలోకి హరీశ్ రావు ఆహ్వానించారు. వీళ్లందరూ ఇన్ని రోజులు ఎర్రజెండా కింద ఉన్నప్పటికీ, వారి మనసులు మాత్రం గులాబీ జెండా కింద ఉండేవని అన్నారు. తమకు  ఉన్న హక్కులన్నింటినీ గులాబి జెండా కిందనే సాధించుకుంటామన్న ఉద్దేశంతోనే వారు టీఆర్ఎస్ లో చేరారని హరీశ్ రావు అన్నారు. ఈ సందర్భంగా మహాకూటమిపై ఆయన విమర్శలు చేశారు. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డికే టికెట్ దక్కలేదంటే ఇంకా ఆ కూటమి ఎందుకు? అని సెటైర్లు విసిరారు.

  • Loading...

More Telugu News