Hyderabad: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం... అవస్థలు పడుతున్న ప్రజలు!
- ఆలస్యంగా నడుస్తున్న మెట్రో రైళ్లు
- సరిదిద్దేందుకు శ్రమిస్తున్న అధికారులు
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తున్న మెట్రోలో ఈ ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. రైళ్లు ఉదయం అరగంట పాటు కదల్లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థలో ఏర్పడిన లోపమే ఇందుకు కారణమని తెలుస్తుండగా, దాన్ని సరిదిద్దేందుకు మెట్రో అధికారులు శ్రమించాల్సి వచ్చింది.
ప్రస్తుతం అరగంట ఆలస్యంగా రైళ్లు తిరుగుతున్నాయి. రైళ్లు ఎక్కిన వారు గమ్యస్థానాలకు చేరాల్సిన సమయంలో చేరలేని పరిస్థతి నెలకొంది. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఉదయం ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ కు గంట లోపే చేరుకోవాల్సిన రైళ్లు, రెండు గంటల సమయాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.