Gujarath: ఇలా పనుల్లో చేరి అలా మాయమైన ‘ఆన్ లైన్’ పనిమనిషి.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు!

  • గుజరాత్ లోని గాంధీనగర్ లో ఘటన
  • ఆన్ లైన్ లో పనిమనిషి నియామకం
  • రూ.46 వేలు తీసుకుని బోర్డు తిప్పేసిన కంపెనీ

పని మనుషులను నియమించే ఓ కంపెనీ యువకుడికి కుచ్చుటోపి పెట్టింది. తొలుత డబ్బులను వసూలు చేసిన సంస్థ, క్యాష్ అకౌంట్ లో పడగానే బోర్డు తిప్పేసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.

అహ్మదాబాద్ లో ఉంటున్న వ్యాపారి రాజ్ దీప్ తన ఇంట్లో పనిమనిషి కోసం షగున్ మెయిడ్ బ్యూరో కంపెనీని సంప్రదించాడు. పనిమనిషికి నెలకు రూ.7 వేలు ఖర్చవుతుందనీ, అడ్వాన్సుగా రూ.46 వేలు చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. దీంతో వారు చెప్పినట్లే నగదును బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశారు. కొద్దిసేపటికే పనిమనిషి నిర్మల ఇంటికి చేరుకోవడంతో పనుల్లో పెట్టారు.

అనంతరం సాయంత్రం పూట కుటుంబ సభ్యులతో పాటు నిర్మలను తీసుకుని షాపింగ్ కు బయలుదేరారు. ఈ సందర్బంగా భోజనం చేస్తుండగా నిర్మల అక్కడి నుంచి చల్లగా జారుకుంది. కాగా, భోజనం అనంతరం నిర్మల కనిపించకపోవడంతో తీవ్రంగా గాలించిన రాజ్ దీప్ చివరికి కంపెనీకి ఫోన్ చేశాడు. అయితే ఎంతసేపు కాల్ చేసినా ఫోన్ కలవకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.  బాధితుడి ఫిర్యాదుతో కంపెనీతో పాటు పనిమనిషి నిర్మలపై అధికారులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News