Sharook Khan: షారుక్ ఖాన్ ని కలవాలని వచ్చిన అభిమాని ఆత్మహత్యాయత్నం!
- శనివారం రాత్రి పార్టీ ఇచ్చిన షారూక్
- కలవాలని కోల్ కతా నుంచి వచ్చిన అభిమాని
- లోనికి వెళ్లనీయకపోవడంతో ఆత్మహత్యాయత్నం
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ అభిమాని ఒకరు ఆయన్ను కలవాలన్న కోరికతో, ఆయన నివాసం ముందే ఆత్మహత్యాయత్నం చేశాడు. నిన్న రాత్రి షారూక్ దీపావళి పార్టీని ఏర్పాటు చేసిన వేళ ఈ ఘటన జరిగింది. విందుకు పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించారు షారూక్. ఇదే సమయంలో కోల్ కతాకు చెందిన మహమ్మద్ సలీమ్ అనే అభిమాని షారూక్ ఇంటికి వచ్చి, అతన్ని కలవాలని కోరాడు. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ఇంటి లోపలి వెళ్లనీయలేదు.
ఈ నేపథ్యంలో వెంట తెచ్చుకున్న కత్తితో ఆ అభిమాని తన చెయ్యిని కోసుకున్నాడు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసుకుంటే, ఈ రకంగానైనా షారుక్‌ను కలిసే అవకాశం వస్తుందని భావించి ఇలా చేసినట్టు సలీం పోలీసులకు తెలిపాడు.