menaka gandhi: మేనకాగాంధీ మాటలు ఘాటుగా ఉన్నాయి.. అయినా, ఆమెను అర్థం చేసుకోగలను: మహారాష్ట్ర సీఎం
- పులిని చంపిన ఘటనపై మండిపడ్డ మేనకాగాంధీ
- జంతు ప్రేమికురాలైన మేనక ఆవేదనను అర్థం చేసుకోగలనన్న ఫడ్నవిస్
- పులిని చంపాలనే నిర్ణయం తమను కూడా బాధించిందన్న సీఎం
మహారాష్ట్రలో అవని అనే ఆడపులిని కాల్చి చంపిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పలువురిని పొట్టన పెట్టుకున్నంత మాత్రాన పులిని చంపేస్తారా? అంటూ జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. పులులను సంరక్షించే విధానం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ దారుణ హత్యే అని కేంద్ర మంత్రి మేనకాగాంధీ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ, పులిని చంపాలనే నిర్ణయం తీసుకోవడం తమను కూడా బాధిస్తోందని చెప్పారు. ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగిందేమో అనే కోణంలో విచారణ కొనసాగుతోందని అన్నారు. మేనకాగాంధీ వ్యాఖ్యలు ఘాటుగా ఉన్నప్పటికీ... ఓ జంతు ప్రేమికురాలిగా ఆమె ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని ఫడ్నవిస్ చెప్పారు.