sensex: మార్కెట్లపై కర్ణాటక ఫలితాల ప్రభావం.. ఒత్తిడికి గురైన సూచీలు
- లాభాలతో ప్రారంభమైనా.. చివరకు ఫ్లాట్ గా ముగిసిన సూచీలు
- 50 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 6 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ లాభాల్లోనే ప్రారంభమైనప్పటికీ... కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా రావడంతో... లాభాలు క్రమంగా కరిగిపోయాయి. బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలు కూడా సూచీలను ఒత్తిడికి గురి చేశాయి. ఫలితంగా మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 50 పాయింట్లు లాభపడి 34,992కు పెరిగింది. నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 10,530 వద్ద క్లోజ్ అయింది.
టాప్ గెయినర్స్:
ఇంటలెక్ట్ డిజైన్ ఎరీనా (11.41%), ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (10.75%), జై కార్ప్ (9.03%), దేనా బ్యాంక్ (6.52%), ట్రైడెంట్ లిమిటెడ్ (5.95%).
టాప్ లూజర్స్:
పీసీ జువెలర్స్ (-11.80%), బాల్ కృష్ణా ఇండస్ట్రీస్ (-11.60%), సిప్లా (-5.68%), మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (-4.01%), ఐఆర్బీ ఇన్ఫ్రా (-3.98%).