statue of unity: ఇలాంటి ప్రాజెక్టులకు భారత్ వేల కోట్లు వెచ్చిస్తుంటే.. ఇక మా నిధులెందుకు?: బ్రిటన్ ఎంపీ పీటర్
- ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కి అన్ని కోట్లు ఖర్చు చేశారా?
- భారత్ లో ప్రత్యేక ప్రాజెక్టులకు మా నిధులెందుకు?
- భారత ప్రభుత్వం తమ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది
‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మాణానికి రూ.3 వేల కోట్లు ఖర్చు చేయడాన్ని బ్రిటన్ కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ పీటర్ బోన్ విమర్శలు గుప్పించారు. ఇలాంటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలను భారత్ వెచ్చిస్తున్నప్పుడు, భారత్ లో ప్రత్యేక ప్రాజెక్టుల నిమిత్తం తమ దేశం నిధులు ఇవ్వాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. భారత ప్రభుత్వం తమ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
గత ఐదేళ్లలో భారత్ లోని పలు పథకాలకు యూకే ఆర్థికసాయం అందజేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మహిళల హక్కులకు సంబంధించి, పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రాజెక్టులు, మతపరమైన సహనం పెంపొందించడానికి ఈ నిధులను సాయం రూపంలో అందించినట్టు చెప్పారు.