visakhapatna: విశాఖ భూముల కుంభకోణంపై సిట్ నివేదిక.. ఇందులో ధర్మాన పేరు!

  • పదిహేనేళ్ల భూ లావాదేవీలపై సిట్ విచారణ
  • తదుపరి చర్యలకు ఓ కమిటీ  ఏర్పాటు  
  • ఈ కమిటీలో లా, రెవెన్యూ, జీఏడీల సెక్రటరీలు

విశాఖపట్టణంలోని భూముల కుంభకోణం వ్యవహారంపై సిట్ నివేదికను సమర్పించింది. ఏపీ కేబినెట్ సమావేశం ముందు ఈ నివేదికను ఉంచారు. విశాఖ భూముల అవకతవకల్లో కొందరు ఐఏఎస్ లు, గ్రేడ్-1 అధికారుల హస్తముందని, కొందరు రాజకీయనాయకులు, మాజీ మంత్రి ప్రమేయం కూడా ఉందని ఈ నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదికలో వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును పేర్కొన్నట్టు సమాచారం. ధర్మాన తనయుడి పేరిట ఉన్న భూముల పైనా సిట్ విచారణ జరిపింది.

గతంలో విశాఖ జిల్లాలో పనిచేసిన ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్ కలెక్టర్లపై అభియోగాలు ఉన్నాయి. సిట్ నివేదికలో 10 మంది  జిల్లా రెవెన్యూ అధికారులు, 14 మంది ఆర్డీవోల పేర్లు ఉన్నాయి. భూ అక్రమాల్లో స్థానిక రాజకీయ నేతల పేర్లను ఈ నివేదికలో పొందుపరిచారు. 100 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని, శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని, కొందరు అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు.

కాగా, పదిహేనేళ్ల భూ లావాదేవీలపై సిట్ విచారణ జరిపింది. ఈ నివేదికపై తదుపరి చర్యలకు ఓ కమిటీని మంత్రి వర్గం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో లా, రెవెన్యూ, జీఏడీలకు చెందిన సెక్రటరీలు ఉంటారని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News