Akhilesh Yadav: ఇదండీ... దేవుళ్లపై బీజేపీకి ఉన్న నిజమైన భక్తి.. స్టేడియం పేరు మార్పును తప్పుబట్టిన అఖిలేశ్ యాదవ్

  • వాజ్‌పేయిపై అభిమానం ఉంటే మరో స్టేడియం కట్టాల్సింది
  • విష్ణుమూర్తి పేరునే మార్చేసింది
  • సమాజంలో విభజనలు తేవడమే బీజేపీ లక్ష్యం

విండీస్‌తో రెండో టీ20 ప్రారంభానికి ముందు లక్నోలోని ‘ఏకనా’ స్టేడియం పేరును మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇంటర్నేషనల్ స్టేడియంగా మార్చడాన్ని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తప్పుబట్టారు. ఏకనా.. అంటే విష్ణుమూర్తి అని అర్థమని, ఆ పేరునే మార్చేసిందంటే.. దేవుళ్లకు బీజేపీ ఇచ్చే గౌరవం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఒకవేళ అంతగా కావాలనుకుంటే వాజ్‌పేయి తండ్రి తరపు వారున్న ఆగ్రాలోని బటేశ్వర్‌లో మరో స్టేడియాన్ని నిర్మించి దానికి ఆయన పేరు పెట్టి ఉంటే సంతోషించి ఉండేవాళ్లమన్నారు.

వాజ్‌పేయి అంటే బీజేపీకి ప్రేమ లేదని, అది నిజంగా ఉండి ఉంటే ఆయన గౌరవార్థం బటేశ్వర్‌ను అభివృద్ధి చేసేవారని అఖిలేశ్ విమర్శించారు. సమాజంలో విభజనలు తేవడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని ఆరోపించారు. యమునా నది ప్రక్షాళన కోసం యోగి సర్కార్ చేసిందేమీ లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బటేశ్వర్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు అఖిలేశ్ గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News