sarkar: సర్కార్ సినిమా చూసినోళ్లంతా ఇప్పుడు ‘సెక్షన్ 49 పి’గురించి మాట్లాడుకుంటున్నారు!
- నటుడు విజయ్‌కు థ్యాంక్స్ చెబుతున్న ప్రజలు
- మరుగున పడిన సెక్షన్ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు
- గూగుల్ ట్రెండ్స్‌ను పోస్ట్ చేసిన సన్ పిక్చర్స్
మంగళవారం విడుదలైన ‘సర్కార్’ సినిమా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా వసూళ్లలో దుమ్మురేపుతోంది. అయితే, ఇప్పుడు సినిమా చూసినవాళ్లంతా ‘సెక్షన్ 49పి’ గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సెక్షన్ ఒకటి ఉందని తమకు తెలియదని, ఈ విషయాన్ని సినిమా ద్వారా తెలియజేసినందుకు నటుడు విజయ్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు.
ఎన్నికల చట్టంలో ‘సెక్షన్ 49 పి’ ఒకటి. ఈ చట్టం గురించి చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదేమో. పోలింగ్ సమయంలో తన ఓటును ఎవరైనా వేసినట్టు ఓటరు గుర్తిస్తే వెంటనే ఆ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులను కోరవచ్చు. సర్కారు సినిమా విడుదలయ్యాక చాలామంది గూగుల్‌లో ‘సెక్షన్ 49పి’ గురించి వెతుకులాట ప్రారంభించారు. దీంతో గూగుల్ సెర్చింజన్లో ఇదే టాప్‌లో నిలిచింది. సినిమాను నిర్మించిన సన్ పిక్సర్చ్ గూగుల్ ట్రెండ్స్ రిపోర్టును ట్విట్టర్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది.