vijay: వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర విషయంలో దిగివచ్చిన మురుగదాస్
- 'సర్కార్' సినిమా చుట్టూ అల్లుకున్న వివాదం
- కొన్నిచోట్ల థియేటర్ల ధ్వంసం
- అభ్యంతరకర సన్నివేశాల కత్తిరింపు
దీపావళి కానుకగా తెలుగు .. తమిళ ప్రేక్షకుల ముందుకు 'సర్కార్' సినిమా వచ్చింది. రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రతినాయకి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించింది. ఆమె పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రతిష్ఠను దెబ్బతీసేవిగా వున్నాయంటూ ఆ పార్టీకి సంబంధించిన వాళ్లు ఆరోపిస్తున్నారు.
ఈ వివాదం కారణంగా కొన్ని చోట్ల ప్రదర్శనలు నిలిచిపోవడం .. థియేటర్ల ధ్వంసం .. మురుగదాస్ పై కేసులు వంటి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో .. వరలక్ష్మీ శరత్ కుమార్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించాలనీ, కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయాలని మురుగదాస్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఈ సినిమా టీమ్ రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు.