sensex: వారాంతాన్ని నష్టాలతో ముగించిన మార్కెట్లు
- ఐటీ, మెటల్, ఎనర్జీ స్టాకులపై అమ్మకాల ఒత్తిడి
- 79 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 13 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
బలహీనంగా ఉన్న ఆసియా మార్కెట్ల ప్రభావంతో మన దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఎనర్జీ, మెటల్ స్టాకులు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 79 పాయింట్లు నష్టపోయి 35,158కి పడిపోయింది. నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 10,585 వద్ద స్థిరపడింది.
టాప్ గెయినర్స్:
లిండే ఇండియా (20.00), ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (17.07), స్ట్రైడ్స్ ఫార్మా (11.15), గేట్ వే డిస్ట్రిపార్క్స్ (11.11), పీసీ జువెలర్స్ (10.07).
టాప్ లూజర్స్:
ఇండియన్ బ్యాంక్ (12.48), శంకర బిల్డింగ్ ప్రాడక్ట్స్ (4.58), ఒబెరాయ్ రియాల్టీ (4.12), కేఈఐ ఇండస్ట్రీస్ (3.74), మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ (3.45).