Rajath kumar: బ్యాలెట్ పత్రం గులాబీ రంగులో.. స్లిప్ తెలుపు రంగులో ఉంటుంది: రజత్ కుమార్

  • నేర చరిత్రను అఫిడవిట్‌లో పొందుపరచాలి
  • సభలు, సమావేశాల కోసం 4462 దరఖాస్తులు
  • ఓటు హక్కు కోసం 3,50,962 దరఖాస్తులు
  • ఫిర్యాదులపై పలువురు నేతలకు నోటీసులు

ఎన్నికల బ్యాలెట్ పత్రం గులాబీ రంగులోనే ఉంటుందని, ఓటర్ స్లిప్ మాత్రం తెలుపు రంగులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. అభ్యర్థుల నేర చరిత్రను అఫిడవిట్‌లో పొందుపరచాలని ఆయన తెలిపారు. ఈ నెల 12న నోటిఫికేషన్ ఇస్తామని రజత్ తెలిపారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాల కోసం 4462 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

ఓటు హక్కు కోసం ఇప్పటివరకు 3,50,962 దరఖాస్తులు వచ్చాయని.. వాటిలో 1,53,115 దరఖాస్తులు ఆమోదించామని, 13,326 తిరస్కరించినట్టు రజత్ స్పష్టం చేశారు. పట్టుబడిన మద్యం విలువ రూ.5.16 కోట్లుగా ఉంటుందని... ఇప్పటివరకు 78, 383 మందిని బైండోవర్‌ చేశామన్నారు. రూ.64.36 కోట్ల నగదు, 2.18 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు రజత్ వెల్లడించారు. ఎన్నికల సన్నద్ధత బాగా జరిగిందని.. ఫిర్యాదులపై పలువురు నేతలకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి అందరికీ ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తామని రజత్ కుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News