stalin: దేశాన్ని కాపాడేందుకు సహకరించాలని స్టాలిన్ ను కోరా: చంద్రబాబు
- బీజేపీని గద్దె దింపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం
- త్వరలోనే మమతా బెనర్జీని కలుస్తా
- తమిళనాడులో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం నడుస్తోంది
ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం అపహాస్యం పాలైందని, బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పారు. ఈ కార్యక్రమంతో బ్లాక్ మనీ వైట్ గా మారిందని విమర్శించారు. బీజేపీని గద్దె దించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని, విభేదాలను వదిలేసి, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ పని చేస్తాయని చెప్పారు.
దేశాన్ని కాపాడేందుకు సహకరించాలని డీఎంకే అధినేత స్టాలిన్ ను కోరానని తెలిపారు. త్వరలోనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతానని చెప్పారు. తమిళనాడులో ప్రస్తుతం రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. చెన్నైలో స్టాలిన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.