Andhra Pradesh: అప్పట్లో వైఎస్ తప్పు చేశారు.. ఇప్పుడు చంద్రబాబు అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నారు!: పవన్ కల్యాణ్

  • వంతాడలో కనీసం తాగడానికి నీళ్లు
  • ఇందుకోసం టీడీపీకి మద్దతు ఇవ్వలేదు
  • అటవీ ప్రాంతంలో మైనింగ్ చేస్తున్నారు

ఓ పెద్ద కంపెనీ తరహాలో తూర్పుగోదావరి జిల్లాలోని వంతాడలో అక్రమ మైనింగ్ సాగుతోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కానీ బయటకు మాత్రం అక్కడ అసలు ఏమీ జరగనట్లు కలరింగ్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ అక్రమ మైనింగ్ దెబ్బకు వంతాడలో తాగేందుకు మంచి నీళ్లు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వు అటవీ ప్రాంతంలో మైనింగ్ చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఈ రోజు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు.

తాము కేవలం వంతాడ ప్రాంతానికే వెళ్లామనీ, ఇలాంటివి అక్రమ తవ్వకాలు ఏజెన్సీ ప్రాంతంలో వందలాది చోట్ల జరుగుతున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇదంతా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

బాక్సైట్ తవ్వకాలకు అనుమతించి వైఎస్ రాజశేఖరరెడ్డి తప్పు చేస్తే.. భారీగా అక్రమ మైనింగ్ కు వత్తాసు పలుకుతూ చంద్రబాబు అంతకంటే పెద్ద తప్పును చేస్తున్నారని వెల్లడించారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసమే టీడీపీకి తాము మద్దతు ఇచ్చామన్నారు. జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News