ashok gehlot: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు: అశోక్ గెహ్లాట్

  • సామాన్యులు, వ్యాపారులు, రైతులు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు
  • ఆర్బీఐ, సీబీఐ, ఈడీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి
  • హిందూ అతివాదంతో బీజేపీ నేతలు భారత లౌకికత్వాన్ని దెబ్బతీస్తున్నారు

స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పుడున్నటువంటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ లేవని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు. అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో అమలవుతోందని మండిపడ్డారు. కీలకమైన రాజ్యాంగ వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని... సామాన్యులు, చిన్న వ్యాపారులు, రైతులు అందరూ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. వ్యవస్థను నిర్మించే ఆలోచనలు బీజేపీకి లేవని విమర్శించారు. మోదీ పాలనలో సీబీఐ, ఈడీ, ఆర్బీఐలాంటి వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే కాంగ్రెస్ తో చంద్రబాబు కలిశారని అన్నారు.

మోదీ చెప్పినట్టు పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని గెహ్లాట్ ఎద్దేవా చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. 'సేవ్ నేషన్ - సేవ్ డెమోక్రసీ' నినాదంతో అందరం కలసి ముందుకు సాగుతామని అన్నారు. హిందూ అతివాదంతో బీజేపీ నేతలు భారత లౌకికత్వాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News