India: చెక్కును వదిలేసి వెళ్లిన రవీంద్ర జడేజా... చెత్తబుట్టలో సఫాయి కార్మికుడికి దొరికింది!

  • తిరువనంతపురంలో ఐదో టీ-20
  • విండీస్ పై గెలిచిన టీమిండియా
  • ప్రజెంటేషన్ చెక్కు చెత్తబుట్టలోకి

వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత పర్యటనలో భాగంగా తిరువనంతపురంలో జరిగిన ఆఖరి టీ-20లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రవీంద్ర జడేజాకు దక్కిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో జడేజాకు వేదికపై, బహూకరించిన రూ. 1 లక్ష చెక్కు ప్రతిరూప పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రెజెంటేషన్ సందర్భంగా రవీంద్ర జడేజాకు ఇచ్చిన చెక్కును స్టేడియం నిర్వాహకులు చెత్త కుప్పలోకి తరలించగా, అది సఫాయి కార్మికుడికి దొరికింది.

దీన్ని ఫోటో తీసిన 'ప్రకృతి' అనే స్వచ్ఛంద సంస్థ ఫేస్ బుక్ లో పెట్టగా అది వైరల్ అయింది. "ఈ చెక్కుల కోసం దయచేసి ప్లాస్టిక్‌ ని వినియోగించ వద్దు" అని బీసీసీఐని కోరింది. కాగా, ఈ చెక్కు జయన్ అనే సఫాయి కార్మికుడికి దొరకగా, 'ఇప్పటికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జయన్' అంటూ 'ప్రకృతి' పోస్టు చేసిన ఫోటోను మీరూ చూడవచ్చు. ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇండియా, సిరీస్ ను 3-1 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News