tjs: టీజేఎస్ కు గుడ్ బై చెప్పిన డాక్టర్ శేషు
- పార్టీ ముసుగులో కోదండరామ్ మోసాలు చేస్తున్నారు
- పార్టీకి అన్యాయం జరుగుతోంది
- అందుకే, టీజేఎస్ ను వీడా
వరంగల్ కు చెందిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) నేత డాక్టర్ శేషు గుడ్ బై చెప్పారు. టీజేఎస్ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర యూత్ కో-ఆర్టినేటర్ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ, పార్టీ ముసుగులో కోదండరామ్ చేస్తున్న మోసాలు బయటపెడతానని హెచ్చరించారు. ఈ సందర్భంగా కోదండరామ్, పార్టీ తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పార్టీకి అన్యాయం జరుగుతున్న కారణంగానే తాను టీజేఎస్ ను వీడాల్సి వచ్చిందని అన్నారు.