Chattisghad: ఛత్తీస్ గఢ్ లో మొదలైన పోలింగ్!
- తొలిదశలో 18 నియోజకవర్గాలకు ఎన్నికలు
- అన్ని ప్రాంతాలూ మావోయిస్టు ప్రాబల్యమున్నవే
- భారీ బందోబస్తు మధ్య కొనసాగుతున్న పోలింగ్
మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్ గఢ్ లో ఈ ఉదయం తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ భారీ బందోబస్తు మధ్య ప్రారంభమైంది. మొత్తం 90 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో నేడు బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, బస్తార్, సుక్మా, రాజనందగావ్, దంతెవాడ జిల్లాలోని 18 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతమంతా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలే కావడంతో పోలీసులు, కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ జరుగనుండగా, పట్టణ ప్రాంతాల్లో 5 గంటల వరకూ పోలింగ్ సాగనుంది. 18 నియోజకవర్గాల్లో 32 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారికోసం 4,336 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.