Tollywood: కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్ విడుదల!

  • కేసీఆర్ గా నటిస్తున్న నాజర్
  • ఈ నెల 16న పాటల విడుదల
  • దర్శకత్వం వహించిన అల్లూరి కృష్ణంరాజు
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితంపై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఉద్యమ సింహం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కేసీఆర్ బాల్యం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన సహా పలు అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో ప్రముఖ నటుడు నాజర్ నటిస్తున్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తయిందనీ, ఈ నెల 16న సినిమా పాటలను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘ఉద్యమ సింహం’ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు.
Tollywood
Telangana
KCR
Chief Minister
movie
udyama simham
first look
biopic
released
nazar

More Telugu News