Congress: సీట్ల కేటాయింపులో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది: రేణుకాచౌదరి

  • ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదు
  • అయినప్పటికీ, కూటమి విజయానికి పనిచేస్తాం
  • నామా కోరితే ఆయన తరపున ప్రచారం చేస్తాను

ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకాచౌదరి అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. అయినప్పటికీ, తెలంగాణలో మహాకూటమి విజయం కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. టీ-టీడీపీ నేత నామా నాగేశ్వరరావు కోరితే ఆయన తరపున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రేణుకా చౌదరి ప్రకటించారు.

కాగా, రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందం వెనుక భారీ స్కామ్ ఉందని  రాహుల్ చేసిన ఆరోపణలపై ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్డ్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ కౌంటర్ ఇచ్చారు. భారత్ లో భాగస్వామిగా ‘రిలయన్స్’ ను తామే ఎంచుకున్నామని, ఆ కంపెనీ కాకుండా మరో ముప్పై మంది భాగస్వాములు ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై రేణుకాచౌదరి స్పందిస్తూ, ఎరిక్ ట్రాపియర్ మంచి రాజకీయనాయకుడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News