sensex: ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ సూచీల అండతో.. లాభాల బాటలోకి మార్కెట్లు!
- 332 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 100 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 10 శాతం పెరిగిన పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్
భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలకు ముగింపు పలికి, నేడు మళ్లీ లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ రంగాల సూచీలు లాభాలను సొంతం చేసుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 332 పాయింట్ల లాభంతో 35,144కు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 10,582కు చేరుకుంది.
టాప్ గెయినర్స్:
పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ (10.09%), అశోకా బిల్డ్ కాన్ (8.60%), ఎన్సీసీ (8.44%), రాడికో ఖైతాన్ (7.71%), గోద్రెజ్ ఇండస్ట్రీస్ (7.16%).
టాప్ లూజర్స్:
అలహాబాద్ బ్యాంక్ (-9.98%), తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్స్ (-7.84%), హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్ (-7.56%), బ్యాంక్ ఆఫ్ ఇండియా (-7.16%), వోక్ హర్డ్ లిమిటెడ్ (-7.14%).