Somireddy Chandramohan Reddy: కేంద్రానివన్నీ కంటితుడుపు చర్యలే: సోమిరెడ్డి
- వర్షాభావ పరిస్థితులున్నా పట్టించుకోవట్లేదు
- తిత్లీ తుపాను వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది
- రూ.220 కోట్లిచ్చి చేతులు దులుపుకుంది
కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు కంటితుడుపు చర్యలేనని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులున్నా పట్టించుకోవడం లేదన్నారు. తిత్లీ తుపాను వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని.. జిల్లాకు రూ.3,600 కోట్ల నష్టం సంభవిస్తే... కేంద్రం రూ.220 కోట్లిచ్చి చేతులు దులుపుకుందని సోమిరెడ్డి విమర్శించారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని 6 జిల్లాల్లో రూ.1658 కోట్ల నష్టం జరిగిందన్నారు. ఇప్పటికే 315 కరవు మండలాలను ప్రకటించామని సోమిరెడ్డి తెలిపారు. విజయనగరంలో జిల్లాలో 17, కర్నూలు జిల్లాలో 16 కరవు మండలాలను తాజాగా ప్రకటించామన్నారు.