shahid afridi: మన దేశాన్నే సరిగా చూసుకోలేకపోతున్నాం... ఇక మనకు కశ్మీర్ ఎందుకు?: షాహిద్ అఫ్రిది
- ఉన్న నాలుగు ప్రావిన్స్ లనే సరిగా చూసుకోలేకపోతున్నాం
- కశ్మీర్ గురించి మరిచిపోండి
- ఉగ్రవాదం నుంచి పాక్ ను రక్షించడం ప్రభుత్వాల చేత కావడం లేదు
కశ్మీర్ గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న నాలుగు ప్రావిన్స్ లనే సరిగా చూసుకోలేకపోతున్నామని... ఇక మనకు కశ్మీర్ ఎందుకని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ గురించి పాకిస్థాన్ మరిచిపోవాలని... పాకిస్థాన్ ను మంచిగా చూసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. లండన్ లో మీడియాతో మాట్లాడుతూ అఫ్రిదీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు.
ఉగ్రవాదుల నుంచి సొంత దేశాన్ని రక్షించడం కూడా తమ ప్రభుత్వాలకు చేత కాలేదని అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ లోయలో ప్రజలు చనిపోవడం తనను ఎంతో బాధిస్తోందని చెప్పాడు. కశ్మీర్ ను ఇండియాకు కూడా ఇవ్వొద్దని... అది ప్రత్యేక దేశం కావాలని అన్నాడు. కశ్మీర్ లో మానవత్వం పరిఢవిల్లాలని ఆకాంక్షించాడు. అఫ్రిది వ్యాఖ్యలు పాకిస్థాన్ లో వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.