sensex: చమురు ధరల ప్రభావంతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- మార్కెట్లలోకి కొత్తగా విదేశీ పెట్టుబడులు
- 119 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 40 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, కొత్తగా విదేశీ పెట్టుబడులు రావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 119 పాయింట్లు పెరిగి 35,261కి ఎగబాకింది. నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 10,617కి చేరుకుంది.
టాప్ గెయినర్స్:
జెట్ ఎయిర్ వేస్ (24.52%), అదానీ ట్రాన్స్ మిషన్ (9.89%), అలహాబాద్ బ్యాంక్ (9.03%), మ్యాక్స్ ఫైనాన్స్ సర్వీసెస్ (8.75%), బిర్లా కార్పొరేషన్ (8.65%).
టాప్ లూజర్స్:
పీసీ జువెలర్స్ (-12.02%), వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (-11.10%), గ్రాసిమ్ ఇండస్ట్రీస్ (-7.91%), ఎన్బీసీసీ ఇండియా (-7.78%), పేజ్ ఇండస్ట్రీస్ (-7.73%).