Eesha Ambani: అత్తింటి నుంచి ఈశా అంబానీకి రూ.450 కోట్ల విలువైన భవనం.. ప్రత్యేకతలివే...!

  • 2012లో వేలంలో గులీటా భవనం దక్కింది
  • ఈ ఏడాది పిరమాల్ కుటుంబానికి బదిలీ
  • వివాహానంతరం గులీటాలోనే ఈశా-ఆనంద్ నివాసం

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తెకు ఆనంద్ పిరమాల్‌తో డిసెంబర్ 12న వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈశాకు అత్తింటి వారు రూ.450 కోట్ల విలువైన అద్భుతమైన కానుకను సిద్ధం చేశారు. 2012లో జరిగిన వేలంలో పిరమాల్ కుటుంబం వర్లీలోని హిందుస్థాన్ యూనిలీవర్‌కు చెందిన గులీటా భవనాన్ని దక్కించుకుంది.

గులీటా భవనంపై హక్కులు మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 19న పిరమాల్ కుటుంబానికి బదిలీ అయ్యాయి. ఈ భవనాన్ని అజయ్‌, స్వాతి పిరమాల్ దంపతులు తమ కొడుకు, కోడలు ఆనంద్-ఈశాలకు కానుకగా ఇవ్వనున్నారు. వివాహానంతరం ఈ జంట ఇక్కడే నివసించనుంది. ప్రస్తుతం ఈ భవనాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. డిసెంబర్ 1న ఈ భవనంలో పూజ జరగనుంది. ముంబయిలో అత్యంత పేరున్న భవనాల జాబితాలో గులీటా ఒకటి కానుంది.

గులీటా భవన ప్రత్యేకతలు...
50,000 చదరపు అడుగుల్లో గులీటా భవనం విస్తరించి ఉంది. మొత్తం ఐదు అంతస్తులుంటాయి. మొదటి అంతస్తులో విశాలమైన లాన్‌, ఓపెన్‌ ఎయిర్‌ వాటర్‌ బాడీ, మల్టీపర్పస్‌ గదులుంటాయి. మిగిలిన అంతస్తుల్లో లివింగ్‌ రూమ్‌, బెడ్‌రూమ్స్‌, భోజనశాలలు, ట్రిపుల్‌ హైట్‌ మల్టీపర్పస్‌ గదులున్నాయి. అక్కడే లాంజ్‌ ఏరియాలు, డ్రెస్సింగ్‌ రూమ్‌లు, పనివారి క్వార్టర్లు సైతం ఉన్నాయి.

  • Loading...

More Telugu News