Google: గంటకు పైగా స్తంభించిన గూగుల్... కనిపెట్టిన ఇండియన్ టెక్కీ!
- నైజీరియా నుంచి గూగుల్ పై దాడి
- గుర్తించిన అమెరికన్ అమిత్ నాయక్
- దర్యాఫ్తు చేస్తున్నామన్న గూగుల్
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ సేవలు 72 నిమిషాల పాటు స్తంభించిపోగా, ఈ విషయాన్ని 'థౌజండ్ ఐస్' అనే కంపెనీకి చెందిన ఇండియన్ అమిత్ నాయక్ గుర్తించారు. సోమవారం నాడు ఈ ఘటన జరుగగా, గూగుల్ దాన్ని నిర్ధారించింది. అమెరికా కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 1.12 నుంచి 2.35 గంటల వరకూ గూగుల్ అనలిటిక్స్, క్లౌడ్ ప్లాట్ ఫామ్, సెర్చింజన్ పని చేయలేదు.
నైజీరియాలోని ఓ టెలికం సంస్థ ఐపీ అడ్రస్ నుంచి గూగుల్ బీజీపీ (బోర్డర్ గేట్ వే ప్రొటోకాల్)పై దాడి చేయడం వల్ల గూగుల్ సేవలు నిలిచిపోయాయి. ఈ విషయంలో తాము దర్యాఫ్తును ప్రారంభించామని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. చైనా, రష్యా, నైజీరియాల్లో తమ సేవలకు అంతరాయం కలిగిందని అన్నారు.