Petrol: మరింతగా దిగివచ్చిన పెట్రోలు, డీజిల్ ధర!
- లీటరు పెట్రోలుపై 18 పైసల తగ్గింపు
- 16 పైసలు తగ్గిన డీజిల్ ధర
- హైదరాబాద్ లో రూ. 82.54కు పెట్రోలు ధర
పెట్రోలు, డీజిల్ ధరలు శుక్రవారం నాడు కూడా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలకు తోడు, దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు, మూడు వారాలకు పైగా నిత్యమూ ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
ఈ క్రమంలో శుక్రవారం నాడు లీటరు పెట్రోలుపై 18 పైసలు, డీజిల్ పై 16 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 77.10కి తగ్గగా, డీజిల్ ధర రూ. 71.93కు చేరింది. ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు ధర రూ. 82.62కు, డీజిల్ ధర రూ. 75.36కు చేరుకుంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.42కు, డీజిల్ ధర రూ. 77.50కి తగ్గింది. విజయవాడలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రూ. 81.22, రూ. 77.30 వద్ద కొనసాగుతున్నాయి.