Pawan Kalyan: ఏం జగన్, నువ్వు చెప్పు.. బైబిల్‌ను పట్టుకుని తిరుగుతావు కదా.. ఎందుకు దాని గురించి మాట్లాడవు?: పవన్ సూటి ప్రశ్న

  • మద్యం నుంచే ప్రభుత్వానికి ఆదాయం
  • మందిరాల వద్ద, మసీదుల వద్ద లిక్కర్ షాపులు
  • జగనేమో రోడ్లు పట్టుకు తిరుగుతున్నారు

తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం రాత్రి రాజానగరంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ పై నిప్పులు చెరిగారు. మద్యం వల్లే ప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్న పవన్.. మసీదులు, మందిరాలు, చర్చిల దగ్గర బ్రాందీ షాపులు పెడుతున్నా అడిగేవాడే కరవయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.

బైబిలును చేత పట్టుకుని తిరిగే జగన్ కూడా దీని గురించి మాట్లాడడం లేదన్నారు. ‘‘జగన్ చెప్పు.. బైబిలును మీరు చేతిలో పట్టుకుని తిరుగుతారు కదా? జీసస్‌ను గుండెల్లో పెట్టుకుని తిరుగుతారు కదా.. మరి చర్చిల వద్ద ఉండే బ్రాందీ షాపుల గురించి మీరెందుకు మాట్లాడడం లేదు’’ అని పవన్ సూటిగా ప్రశ్నించారు.

కన్నతల్లి లాంటి కన్న భూమిని గౌరవించాల్సిన జగన్ ‘జైహింద్’ అని, ‘భారత్ మాతాకీ జై’ అని అనడని పవన్ ఆరోపించారు. భారత్ మాతాకీ జై అనే పదం ప్రతి ఒక్కరిదీ అని, దానిపై బీజేపీకి పేటెంట్ హక్కు లేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన జగన్ రోడ్ల మీద తిరుగుతున్నారని, ముఖ్యమంత్రిని చేస్తేనే అన్నీ చేస్తానని అంటున్నారని పవన్ ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News