Sabarimala: కొచ్చి ఎయిర్ పోర్టులో నేలపై కూర్చుని టిఫిన్ తిన్న తృప్తి దేశాయ్... టాక్సీ ఇచ్చేందుకు డ్రైవర్ల నిరాకరణ!

  • తృప్తి దేశాయ్ రావడంపై తీవ్ర నిరసన
  • ఎయిర్ పోర్టు నుంచి బయటకు కదలని తృప్తి
  • నిరసనకారులకు టాక్సీవాలాల మద్దతు

అయ్యప్ప దర్శనం కోసం కొచ్చి, నెడుంబాసరేలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్‌ కు తీవ్ర నిరసన ఎదురవుతోంది. ఆమె బృందాన్ని ఎయిర్‌ పోర్టు నుంచి బయటికి రానివ్వబోమంటూ భక్తులు బయటే బైఠాయించగా, పోలీసులు అమెను విమానాశ్రయంలోనే ఉంచారు. ఎయిర్ పోర్టులో నేలపై కూర్చున్న ఆమె, తన బృందంలోని ఇతర మహిళలతో కలసి అక్కడే అల్పాహారం చేశారు.

ఇక, నిరసన తెలుపుతున్న వారికి మద్దతు తెలిపిన ట్యాక్సీ డ్రైవర్లు, తృప్తి దేశాయ్‌ ని, ఆమె బృందాన్ని విమానాశ్రయం నుంచి బయటికి తీసుకెళ్లేది లేదని వెల్లడించారు. పోలీసులు తనకు భద్రతను కల్పించకున్నా, తాను శబరిమలకు వెళ్లి తీరుతానని ఆమె వెల్లడించారు.






  • Loading...

More Telugu News