hemasundar: రామారావుగారు అలా చేయడంతో నేను షాక్ అయ్యాను: నటుడు హేమసుందర్

  • నేను కాళ్లకు నమస్కరించను 
  • ఎన్టీఆర్ ను చూసి తప్పుకున్నాను 
  • నేనెక్కడా? ఆయనెక్కడా? 

తెలుగు తెరపై తండ్రి .. తాత పాత్రల ద్వారా హేమసుందర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ అందరినీ ఎంతగానో ఆకట్టుకునేది. అలాంటి ఆయన ఎన్టీ రామారావు గురించి ప్రస్తావించారు. " మొదటి నుంచి కూడా నాకు ఎవరి కాళ్లపైనా పడి నమస్కారం పెట్టడం ఇష్టం ఉండేది కాదు. ఎన్టీఆర్ గారు కనిపించగానే అంతా కాళ్లకు నమస్కారం పెట్టేవారు. ఆయనతో నేను 'ప్రేమ సింహాసనం' సినిమా చేశాను. ఆ సినిమా సెట్లోకి ఎన్టీఆర్ వస్తుంటే కాళ్లకు నమస్కారం పెట్టాల్సి వస్తుందని నేను అక్కడి నుంచి కాస్త దూరంగా వెళ్లాను.

 ఆ రోజున ఫస్టు సీన్ మా ఇద్దరి పైనే, తాత పాత్రలో నేను .. మనవడిగా ఎన్టీఆర్. మనవడిగా ఎన్టీఆర్ వచ్చి నా కాళ్లపై పడిపోయారు .. రిహార్సల్స్ లో అలా లేకపోవడం వలన నేను షాక్ అయ్యాను. ఆ తరువాత ఆయన ఎక్కడ? .. నేను ఎక్కడ? .. ఆయన కాళ్లపై పడటానికి నేను అంతగా ఆలోచించాను .. సీన్ కోసం ఆయన చాలా తేలికగా ఆ పని చేశారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా ఆయన పాదాలకి నమస్కరించాను" అని చెప్పుకొచ్చారు.   

  • Loading...

More Telugu News