state bank of india: మొబైల్ నంబర్ లేకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ బంద్.. ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక!

  • ఈ నెల 30లోగా రిజిస్టర్ చేసుకోండి
  • లేదంటే ఈ-బ్యాంకింగ్ ఆపేస్తామని వెల్లడి
  • మోసాలను అరికట్టేందుకేనని వివరణ

ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30లోగా తమ మొబైల్ నంబర్లను బ్యాంకు ఖాతాలకు లింక్ చేసుకోవాలని సూచించింది. ఒకవేళ ఈ నెల 30లోగా మొబైల్ నంబర్లను అనుసంధానం చేసుకోకపోతే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు తమ అధికారిక వెబ్ సైట్ లో ఎస్బీఐ ప్రకటించింది.

కొత్తగా తెచ్చిన ఈ సంస్కరణలు డిసెంబర్ 1 నుంచి అమలు అవుతాయని ఎస్బీఐ తెలిపింది. కస్టమర్లు తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సైబర్ నేరాలను దీనిద్వారా అరికట్టవచ్చన్నారు. బ్యాంకు బ్రాంచ్ లేదా ఏటీఎం కేంద్రాల ద్వారా ఖాతాదారులు మొబైల్ నంబర్ ను రిజిస్టర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News