rrr: ‘చరణ్ రెడీ.. తారక్ ఆర్ యూ.. సౌండ్.. యాక్షన్‘.. రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ వీడియో విడుదల!

  • ప్రారంభమైన ఆర్ఆర్ఆర్ షూటింగ్
  • మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తున్న రాజమౌళి
  • 2020లో రిలీజ్ కు సన్నాహాలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ గా ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను ప్రారంభించిన దర్శకుడు రాజమౌళి.. తొలి షాట్ వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ‘ఎవ్రీవన్ రెడీ.. లెట్స్ గో ఫర్ ఏ టేక్.. బ్యాక్ గ్రౌండ్ రెడీనా? చరణ్.. రెడీ? తారక్.. ఆర్ యూ? ఒకే క్లాపిన్ .. సౌండ్.. యాక్షన్’ అంటూ షూటింగ్ ను ప్రారంభించారు. ఈ వీడియోను రాజమౌళి ఫేస్ బుక్ లో పంచుకున్నారు.

ఎన్టీఆర్, రామచరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ సినిమాను 2020లో విడుదల చేసేందుకు నిర్మాత డీవీవీ దానయ్య సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫర్ గా సెంథిల్ కుమార్ వ్యవహరిస్తున్నారు.
rrr
Rajamouli
Ramcharan
Tollywood
first shoot
started
Facebook
released

More Telugu News