Madhya Pradesh: ఎవరికి ఓటేయమని కోరాలో అర్థంకాని స్థితిలో అమిత్ షా.. కార్యదర్శికి చివాట్లు!
- మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు
- చుర్హాట్ లో బీజేపీ ర్యాలీ
- బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా
- అభ్యర్థుల పేర్లు తెలియక అసహనం
మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ, నిన్న ఓ భారీ ర్యాలీ, ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రసంగంలో తడబడ్డారు. అక్కడ బరిలో నిలుచున్న అభ్యర్థులు ఎవరో తెలియక, తన కార్యదర్శిపై మండిపడ్డారు. దగ్గరకు పిలిచి చెడామడా తిట్టేశారు. చుర్హాట్ లో ఈ ఘటన జరిగింది.
ఆయనకు అందించిన స్పీచ్ కాపీలో, స్థానికంగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల వివరాలు లేవు. దీంతో ఎవరికి ఓటు వేయాలని ప్రజలను కోరాలో తెలియని స్థితిలో ఉన్న ఆయన, కార్యదర్శిని పిలిచి, ఇందులో, అభ్యర్థుల పేర్లు ఎక్కడ? అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. దీనికాయన భయపడుతూ, 'రాశాను సార్' అని జవాబివ్వగా, ఏది? ఎక్కడ రాశావు? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.